![]() |
2025 కొన్ని రోజుల్లో బైబై చెప్పేయబోతోంది. డిసెంబర్ 31st రావడానికి ఎన్నో రోజులు లేదు. ఇక ఈ సందర్భంగా కం 2 ఢీ పార్టీ పేరుతో ఈటీవీ న్యూ ఇయర్ ఈవెంట్ జరపబోతోంది. దాని ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో జాఫర్ కనిపించాడు. లాస్ట్ లో ఆదిని, సుధీర్ ని కూర్చోబెట్టి కొన్ని ప్రశ్నలు వేసాడు. "ఆది ఒక్కోసారి షోలో వేసే పంచులు వలన అవతలి వారి మనోభావాలు దెబ్బతింటాయని తెలిసిన పట్టించుకోని పరిస్థితి ఉండదా" అని ఆదిని అడిగాడు. "అవన్నీ ఉండవండి మన దగ్గర" అని ఆన్సర్ ఇచ్చాడు. "ఎంఎల్ఏగా ఎప్పుడు ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు..ఆది నాకు ఆ సమాచారం ఉంది" అని అన్నాడు జాఫర్. జిల్లా పేరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తన మనసులో భావాన్ని పరోక్షంగా చెప్పిన ఆది అన్నాడు జాఫర్. ఐతే ఇంతకు ఏ జిల్లా అనే పేరు మాత్రం ప్రోమోలో వినిపించనివ్వలేదు. "ఈ మధ్య మీరు ఒక లవ్ స్టోరీ నుంచి బయటకు వచ్చారు. ఏంటి కావ్య రీజన్" అంటూ కావ్యని కూడా ఎన్కౌంటర్ చేసాడు.
ఇక ప్రోమో స్టార్టింగ్ లో బ్రేకింగ్ న్యూస్ అంటూ జాఫర్ వచ్చి "ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే టాపిక్ హూ ఈజ్ ది బెస్ట్ ఎంటర్టైనర్ ఆదినా సుధీర్ ఆ అని" అడిగాడు. ఈ ప్రశ్నకు నెటిజన్స్ ఐతే సుధీర్ పేరును ఎక్కువగా మెన్షన్ చేశారు. అలాగే కొంతమంది సుధీర్ ని కొంతమంది ఆదిని ఉద్దేశిస్తూ రిప్లైస్ ఇచ్చారు. అలాగే ఈ ఇద్దరి కంబినేషన్ కూడా బాగుంటుంది అంటూ కూడా చెప్పాడు. "సుధీర్ అన్న యాంకర్ గా ఉన్నా అభిమానిస్తాం, హీరోగా ఉన్నా అభిమానిస్తాం, కమెడియన్ గా ఉన్నాఅభిమానిస్తాం, మాకు కావాల్సింది కేవలం సుధీర్ అన్న మాత్రమే, ఆది అన్న కామెడీ కింగ్' అంటూ నెటిజన్స్ వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు.
![]() |